ఎమ్మెల్యేలకు సీఎం విజయ్‌ బంపర్ ప్యాకేజీ

3
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం శాసనసభలో ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పర్యటనలు, ప్రజా సేవ సులభతరం చేసేందుకు ప్రభుత్వ వాహనాలతో పాటు నెలకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, స్థానిక సమస్యలను పరిశీలించడానికి ప్రజాప్రతినిధులు తరచూ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఈ కొత్త ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

MLAల అలవెన్స్…డ్రైవర్ జీతం మరియు వాహన ఖర్చుల కోసం నెలకు రూ. 75,000 అలవెన్స్ ఇస్తారు. దీనికి తోడు కార్యాలయ సహాయకుడి నియామకం కోసం ప్రతి MLA కార్యాలయానికి నెలకు రూ. 25,000 అందిస్తారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచారు

చెన్నై, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్ మరియు కన్యాకుమారి ప్రభుత్వ ఆసుపత్రులలో ట్రాన్స్‌జెండర్ల కోసం అదనపు వైద్య మరియు శస్త్రచికిత్స సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో సీట్లను పెంచేందుకు రూ. 351 కోట్లు కేటాయించారు. దీనిద్వారా వివిధ కోర్సుల్లో అదనంగా 6,098 సీట్లు అందుబాటులోకి రానున్నాయి (660 B.Sc. నర్సింగ్, నర్సింగ్ కాలేజీల్లో 1,925 సీట్లు, 12 పారామెడికల్ కోర్సుల్లో 2,778 సీట్లు మరియు 735 మెడికల్ సీట్లు). అంతేకాకుండా 7 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.

Also Read:పరకాల నాదే..కొండా షాకింగ్!

పెరంబలూరులో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. పాల సేకరణ ధరను లీటరుకు రూ. 38 నుండి రూ. 41కి పెంచారు. దీనివల్ల 3.16 లక్షల మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు లబ్ధి చేకూరనుంది. అలాగే లీటరుకు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని రూ. 3 నుండి రూ. 5కి పెంచారు. దీనివలన ప్రభుత్వంపై నెలకు రూ. 30 కోట్లు..ఏడాదికి రూ. 360 కోట్ల అదనపు భారం పడుతుంది.

- Advertisement -