అస్సాం వరదలు..రూ.480 కోట్ల నష్టం!

1
- Advertisement -

రాష్ట్రంలో గత నెలలో సంభవించిన వరదల వల్ల దాదాపు రూ. 480 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, 26,681 ఇళ్లు దెబ్బతిన్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం తెలిపారు. ఇటీవల వచ్చిన వరద విపత్తుతో నష్టపోయిన 96,842 కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 15,000 చొప్పున సహాయం అందించినట్లు, వరద ప్రభావిత జిల్లాల్లో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ (PMAY) కింద ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఎం శర్మ మాట్లాడుతూ.. చరాయిడియో, శివసాగర్, జోర్హాట్ మరియు గోలాఘాట్ జిల్లాల్లో నష్ట పరిహార అంచనా సర్వే శరవేగంగా జరుగుతోందని తెలిపారు. రెండో విడత నష్టపరిహార అంచనా సర్వే సెప్టెంబర్ 10 లేదా 11 నాటికి పూర్తవుతుంది. బాధితుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వస్తే, మూడో విడత అంచనా వేయడానికి కూడా మా బృందాలు సిద్ధంగా ఉంటాయి. దసరా (దుర్గాపూజ) పండుగకు ముందే వరద బాధితులకు పరిహారం మొత్తాన్ని పంపిణీ చేయడమే మా లక్ష్యం అని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాత చరాయిడియో మరియు శివసాగర్ జిల్లాల్లోని అర్హులైన లబ్ధిదారులకు PMAY ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎంబ తెలిపారు. ఆర్థిక సహాయం గురించి సీఎం శర్మ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 96,842 వరద బాధిత కుటుంబాలకు రూ. 15,000 చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 146.26 కోట్లు ఖర్చు చేసింది. మరో 3,000 నుండి 4,000 కుటుంబాలకు కూడా ఈ సహాయం అందించాల్సి రావచ్చు అని వివరించారు. బాధితులెవరూ విస్మరణకు గురికాకూడదని పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని అధికారులకు సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read:యాంకర్ అనుసూయకు బిగ్‌షాక్

- Advertisement -