పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావాలని ప్రధాని మోదీ అధికారులకు స్పష్టంగా ఆదేశించారని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారతదేశం చూపిన “సౌమ్యత, సహనాన్ని” బలహీనతగా భావించవద్దని భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు.
2025లో 26 మంది (ఎక్కువగా పర్యాటకులు) ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడి నేరస్థులు “భూమిపై ఉన్నా లేదా నరకంలో ఉన్నా” ఏ మూల ఉన్నా సరే వారిని శిక్షించి తీరాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని 88 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ సింధూర్’ డాక్యుసిరీస్‌లో అజిత్ దోవల్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ కింద పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలను భారత్ విజయవంతంగా ధ్వంసం చేసింది.
డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ డాక్యుసిరీస్‌లో దోవల్ మాట్లాడుతూ…పహల్గామ్ దాడి జరిగినప్పుడు ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారని, ఆ దాడి కారణంగా పర్యటనను మధ్యలోనే ముగించుకుని రావాల్సి వచ్చిందని తెలిపారు. తిరిగొచ్చిన వెంటనే ప్రధాని ఉన్నతాధికారులతో సమావేశమై అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని తిరిగొచ్చారు. విదేశాంగ కార్యదర్శి ఆయనకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. ఆపై విమానాశ్రయంలోనే మేము ఒక సమావేశం నిర్వహించాము. మొదట ఆయన అన్ని వాస్తవాలను తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న— ‘ఇది ఎవరు చేశారు? దీనికి ఎవరు బాధ్యులు? దాడికి పాల్పడినవారెవరో మనకు స్పష్టంగా తెలియాలి. నాకు ఆ వివరాలు వెంటనే కావాలి’ అని ఆదేశించారు అని దోవల్ చెప్పారు. మన నిఘా సంస్థల పుణ్యమా అని భారత అధికారులు ఆ ముగింపునకు త్వరగానే రాగలిగారని ఆయన జోడించారు.
Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

