చాండీపురా వైరస్..రంగంలోకి ICMR!

1
- Advertisement -

గుజరాత్‌లో వ్యాపిస్తున్న చాండీపురా వైరస్ (Chandipura Virus) కేసులు నివారణా చర్యలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణులతో కూడిన ఒక జాతీయ బృందాన్ని గుజరాత్‌కు పంపినట్లు అధికారుల ద్వారా వెల్లడైంది.

రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు, ఇతర నిపుణులతో కలిసి ఈ జాతీయ బృందం పనిచేస్తుందని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్ తెలిపారు. ఈ వ్యాధి ఎక్కడి నుండి వస్తోంది, తరచూ ఎందుకు విజృంభిస్తోంది అనే అంశాలపై గత రెండేళ్లుగా ఐసీఎంఆర్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఇప్పుడు కొత్త చికిత్సా మార్గాలు, వైరస్ నియంత్రణ చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌కు కూడా ‘నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్ రెస్పాన్స్ టీమ్’ (NJORT) ని పంపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం చాండీపురా వైరస్ అనేది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది ప్రధానంగా ఈగలు , దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతూ తీవ్రమైన పక్షవాతం, నాడీ సంబంధిత సమస్యలు కలగజేస్తుంది.

తొలుత సాధారణ జ్వరం, తీవ్రమైన తలనొప్పితో ప్రారంభమయ్యే ఈ వ్యాధి… త్వరగా మూర్ఛ , కోమాకు దారితీస్తుంది. గతంలో భారతదేశంలో నమోదైన చాండీపురా వైరస్ ఘటనల్లో మరణాల రేటు 56 శాతం నుండి 75 శాతం వరకు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read:మ్యారేజ్ డే..మొక్కలు నాటిన సంతోష్ దంపతులు

- Advertisement -