రూ. 87 కోట్ల ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. జగిత్యాల జిల్లాకు చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధాన అనుచరుడు కొండా లక్ష్మణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల జిల్లాలో సుమారు రూ. 87 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మళ్లింపు, బియ్యం నిల్వల అక్రమ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మళ్లించి అక్రమంగా రైస్ మిల్లుల్లో నిల్వ చేయడం…. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం బకాయిలను సమర్పించకపోవడం. ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన కోట్లాది రూపాయల నగదు బకాయిలను ఎగవేసి, ప్రభుత్వం మరియు ప్రజల సొమ్మును మోసం చేయడం.
ప్రజా నిరసనలపై స్పందించిన బీజేపీ అధిష్టానం, పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా కొండా లక్ష్మణ్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని స్థానిక ప్రజలు మరియు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ నో!


