SIR:ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

6
- Advertisement -

ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కును తొలగించడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన తన ఓటును తొలగించడం వెనుక రాజకీయం ఉందో లేక సాంకేతిక లోపమో స్పష్టం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

నేను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా కూడా పోటీ చేశాను. కానీ ఇప్పుడు SIR ప్రక్రియ పేరుతో అదే నియోజకవర్గంలో నా ఓటు హక్కును తొలగించారు అని వీడియోలో పేర్కొన్నారు.

ఓటును ఎందుకు తొలగించారో సరైన సమాచారం లేదు. తిరిగి ఓటు హక్కు పొందడానికి ఎలాంటి పత్రాలు (Documents) సమర్పించాలో కూడా అధికారులు సరిగ్గా చెప్పలేకపోతున్నారు..ఓటు తొలగింపు వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందనే కోణంలో స్పందిస్తూ ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. నా ఓటు తొలగించినంత మాత్రాన నా గొంతు నొక్కలేరు. భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్ని కుట్రలు చేసినా వారు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నేను ఎప్పటికీ వెనుకాడను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో ప్రస్తుతం సాగుతున్న SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మరియు ఓట్ల డిజిటైజేషన్ విధానంపై అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:ఇరాన్‌ ప్రతిపాదనకు ట్రంప్ నో!

- Advertisement -