పాపం చేసి చేతులు కడుక్కుంటారా?

1
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన వరుణయాగంపై ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని, కాంగ్రెస్ చేసిన వరుణయాగం పాపం చేసి చేతులు కడుక్కున్నట్లు ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు తీరిగ్గా యజ్ఞాలు, యాగాలు చేస్తూ గాల్లో దీపం పెట్టినట్లు వ్యవహరిస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టుల్లోకి వచ్చిన విలువైన కృష్ణా, గోదావరి జలాలను సరిగ్గా నిర్వహించకుండా, సముద్రంలోకి వదిలేసి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు.

Also Read:ఇరాన్‌ ప్రతిపాదనకు ట్రంప్ నో!

కాంగ్రెస్ ప్రభుత్వం నీటి యాజమాన్యంలో చేసిన పొరపాట్లు మరియు రైతాంగానికి చేసిన అన్యాయాన్ని త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం దేవుడి పేరు చెప్పి తమ వైఫల్యాల నుంచి తప్పుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

- Advertisement -