ప్రధాని మోదీతో NCP-SP ఎంపీల భేటీ

3
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి వారంలో భాగంగా సోమవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) కి చెందిన ఎనిమిది మంది లోక్‌సభ సభ్యుల బృందం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైంది. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ మరియు ఎఫ్‌సిఆర్‌ఎ (FCRA) బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపక్షాల మద్దతు కోరుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకమైనదని, సుప్రియా సులే (బారామతి), సురేష్ మ్హాత్కే (భివాండీ), భాస్కర్ భగారే (దిండోరీ), అమర్ శరద్రావు కాలే (వార్ధా), అమోల్ కోల్హే (షిరూర్), నీలేష్ జ్ఞానదేవ్ లంకే (అహ్మద్‌నగర్), భజరంగ్ మనోహర్ సోనావనే (బీడ్), మరియు ధైర్యశీల్ మోహితే పాటిల్ (మాధా) తదితర ఎంపీలు మహారాష్ట్రకు చెందిన స్థానిక అంశాలపై ప్రధానితో చర్చించారని పార్టీ తెలిపింది.

సమాచారం ప్రకారం… సోలాపూర్ ఉజ్జయిని డ్యామ్ నీటిని బీడ్ జిల్లాకు అందించాలని సోనావనే కోరారు. నాసిక్-పుణే రైల్వే లైన్ వివాదాన్ని కాలే లేవనెత్తగా, నవీ ముంబై విమానాశ్రయానికి భూమిపుత్ర డిబి పాటిల్ పేరు పెట్టాలని మ్హాత్కే డిమాండ్ చేశారు. ఎంపీలు రైతులకు సంబంధించిన సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

అయితే లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచేలా ప్రతిపాదనలు ఉంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని పరిశీలిస్తామని సుప్రియా సులే గత నెలలో సూచించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ ప్రయత్నాలకు ఎన్సీపీ(ఎస్‌పీ) మద్దతు ఇవ్వవచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి.అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచే నిబంధనను చేరిస్తే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని పరిశీలిస్తామని సులే తెలిపారు. అదే సమయంలో తమ పార్టీ అధికార నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ (ఎన్‌డీఏ)లో చేరుతుందనే వార్తలను ఆమె తోసిపుచ్చారు.

“కొత్త బిల్లు సభ ముందుకు వచ్చే వరకు మేము ఏమీ చెప్పలేం. మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తి మెజారిటీతో ఆమోదించాం. ఎన్సీపీ (ఎస్‌పీ)కి చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. శరద్ పవార్ నాయకత్వం వహించడమే కాకుండా ప్రతి సభ్యుడిపై నమ్మకం ఉంచి, అందరి మాట వినే పార్టీ ఎన్సీపీ” అని సుప్రియా సులే పేర్కొన్నారు.

మరోవైపు ఎన్సీపీ(ఎస్‌పీ)కి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… ప్రధాని మోదీతో భేటీలో డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులపై ‘ఇండియా’ (INDIA) కూటమి యొక్క స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని శరద్ పవార్ వర్గాన్ని కోరింది. మహారాష్ట్రకు సంబంధించిన సమస్యలపై శరద్‌చంద్ర పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలిసిందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్నాయి.

Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

- Advertisement -