విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమా నుంచి తాజాగా ప్రముఖ నటి టబుకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్రంలో టబు ‘గౌరి హెగ్డే’ అనే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు తను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ డోస్‌తో కూడిన పాత్రలో ఆమె దర్శనమిచ్చారు. గ్లింప్స్‌లో ఆమె పవర్ ఫుల్ లుక్, కంబ్యాట్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టుగా టబు పాత్రను డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన టబు గ్లింప్స్ ఆ ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ దునియా విజయ్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు.
ALso Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు
విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడం, దానికి తోడు టబు వంటి దిగ్గజ నటి పవర్‌ఫుల్ రోల్ చేస్తుండటంతో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

