తమిళం మా జీవనాడి:విజయ్

1
- Advertisement -

ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందేమాతరం’ను ప్రథమంగా ప్లే చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానం కేంద్ర నిర్ణయానికి సవాల్‌గా నిలిచింది. శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం విజయ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలైన డిఎంకే , ఏఐఏడీఎంకే సహా అన్ని పక్షాలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని దీని అమలుకు ఎలాంటి తదుపరి అనుమతులు అవసరం లేదని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.

శాసనసభలో అత్యంత భావోద్వేగంగా ప్రసంగించిన విజయ్… తమ ప్రభుత్వం రాష్ట్ర భాషా, సాంస్కృతిక హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మా జీవనాడి, మా భావోద్వేగం అని పేర్కొంటూ మాతృభాష మాతృత్వమంత పవిత్రమైనదని వ్యాఖ్యానించారు.

తమిళం అంటే ఆత్మగౌరవం, తమిళం అంటే శక్తి… ‘తమిళం’ అనే పదం ఉచ్చరించగానే మొత్తం తమిళనాడు అంతా ఒక్కటిగా నిలబడుతుంది. తమిళనాడులో ‘తమిళ్ తాయ్ వాజ్తు’కే మొదటి స్థానం ఉండాలి. ఆ గీతానికి తొలి స్థానం ఇవ్వడం మన హక్కు అని ఆయన ఉద్ఘాటించారు. ఈ తీర్మానం ప్రకారం తమిళనాడులోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని తప్పనిసరిగా మొదటగా ఆలపించాల్సి ఉంటుంది.

:గత జనవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదట జాతీయ గేయాన్ని (వందేమాతరం), ఆ తర్వాత జాతీయ గీతాన్ని (జనగణమన) ఆలపించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. జులై 9న ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను కోరింది.

Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

- Advertisement -