CWG విజేతలపై మోదీ ప్రశంసలు

1
- Advertisement -

కామన్‌వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026)లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆత్మీయంగా సమావేశమయ్యారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు వారి పట్టుదల, శ్రమ మరియు కృషిని ప్రధాని అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తన నివాసానికి తరచుగా వచ్చే అతిథుల్లో క్రీడాకారులే ముందుంటారని పేర్కొన్నారు. నేను ఈ ఇంట్లో దాదాపు 12 నుండి 13 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను క్రమం తప్పకుండా ప్రతిసారీ సాదరంగా ఆహ్వానించేది ఎవరినైనా ఉందంటే అది అథ్లెట్లనే. గత 10 నుండి 12 సంవత్సరాలుగా మీ కష్టపడే తత్వం భారతదేశానికి విజయాన్ని అందించాలనే మీ నిరంతర ప్రయత్నాలు మరియు విజయాల కొత్త శిఖరాలను అధిరోహించే సాంప్రదాయమే దీనికి కారణం అని మోదీ తెలిపారు.

యువత క్రీడల వైపు అడుగులు వేసేలా ప్రేరేపించడంలో అథ్లెట్ల సాధనలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన నొక్కిచెప్పారు. మేము పాఠశాలలకు వెళ్తూ ..మీరు క్రీడలు ఆడాలి అని చెప్పే మాటల కంటే మీరు సాధించిన పతకాలే వారిలో అత్యధిక స్ఫూర్తిని నింపుతాయి ని వ్యాఖ్యానించారు.

Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు

ఈ సమావేశంలో ప్రధాని మోదీ పలువురు క్రీడాకారులతో విడివిడిగా మాట్లాడారు. మహిళల షాట్‌పుట్ F57 స్వర్ణ పతక విజేత షర్మిలా ధంకర్‌తో మాట్లాడుతూ… గతంలో ఆమె ఇచ్చిన ఒక హామీని గుర్తుచేశారు. గతంలో మీరు మీ ఇద్దరు కుమార్తెలను కూడా అథ్లెట్లుగా తీర్చిదిద్దుతానని నాకొక మాట ఇచ్చారు అని మోదీ అన్నారు. దానికి షర్మిల స్పందిస్తూ… అవును సర్, వారు ఇంకా చిన్న పిల్లలే. వచ్చే కామన్‌వెల్త్ గేమ్స్‌ నాటికి మా ఒకే ఇంటి నుండి మూడు పతకాలు రావడం మీరు చూస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -