పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు

3
- Advertisement -

పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన నడుమ లేడని ఎట్టి పరిస్థితులలో ఆందోళన చెందవద్దని, ధైర్యం చెడొద్దని, పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా నేనున్నానని, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు తల్లి, కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ, అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎర్రవెల్లి నివాసం నుంచి, ఆదివారం మధ్యాహ్నం బయలుదేరిన పార్టీ అధినేత కేసిఆర్ గారు నల్లబెల్లికి చేరుకున్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే”.. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి”.. అంటూ సాగిన కార్యకర్తల నినాదాలు నడుమ, పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న., పిల్లలు, తల్లి అమృతమ్మ, లను కెసిఆర్ ఓదార్చారు.ద్ది అన్నాదమ్ములను కుటుంబ సభ్యులను పలకరించి కేసీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా వారికి కుటుంబ పెద్దగా ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను పలకరించి కేసీఆర్ వారిని ఓదార్చారు. తల్లికి ధైర్య వచనాలు చెప్పారు. భార్య స్వప్నకు గుండె ధైర్యం నింపారు. పిల్లలను బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. వారికి తండ్రి లేని లోటు లేకుండా చూసుకోవాలనీ,పిల్లలను కాపాడుకోవాలనీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నలకు కేసిఆర్ సూచించారు. కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కాసేపు విషణ్ణ వదనంతో మౌనంగా ఉండిపోయారు.పార్టీ స్థాపించిన నాటి నుండి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు పోవడంలో పార్టీ నిర్మాణంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్రను మనకు అనుచరుడుగా ఆత్మీయుడుగా పెద్దితో తనకున్న అనుబంధాన్ని కెసిఆర్ గారు బాధా తప్త ఉదయం తో స్మరించుకున్నారు.

ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కల్మషం లేని హృదయంతో స్వచ్ఛంగా మాట్లాడే పెద్ది ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక, బాధతో ఉన్న కేసీఆర్ తో సహా పార్టీ ముఖ్యులు కుటుంబ సభ్యులు ఆవేదన లో మునిగి ఉండగా, అక్కడి వాతావరణం గంభీరంగా మారింది.పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు రాల్చారు. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని దుఃఖ పడ్డారు.ఆత్మీయుణ్ణి తలుచుకుంటూ, విషణ్ణ వదనంలో మునిగి పోయారు.కాసేపు భావోద్వేగానికి గురై, నోట మాటరాక మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు.తన పార్టీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం కేసీఆర్ హృదయం.. తల్లడిల్లింది.కాగా పరిస్థితిని గమనించిన పార్టీ ముఖ్య నాయకులు చొరవ తీసుకొని కెసిఆర్ గారిని పలకరించి అనునయించడంతో, కెసిఆర్ గారు కొంత తేరుకున్నారు. దాంతో అక్కడి వాతావరణం కాస్త తేలిక పడింది.

కాగా ఇప్పటికే ప్రకటించిన ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి చొప్పున 2 కోట్ల రూపాయల చెక్కులను కెసిఆర్ అందజేశారు.అదే సందర్భంలో…పెద్ది తల్లికి కూడా 25 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేశారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం నింపుతూ, కేసీఆర్ తిరుగు ప్రయాణమయ్యారు.

కాగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కెసిఆర్ గారికి సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి రావడంతో నల్లబెల్లి నర్సంపేట రోడ్లు పరిసర ప్రాంతాలు జన సందోహంతో నిండిపోయాయి.జై తెలంగాణ కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి మళ్లీ కెసిఆర్ ఏ సీఎం కావాలి పెద్ది పెద్ది సుదర్శన్ రెడ్డి జోహార్ నినాదాలతో నల్లబెల్లి దద్దరిల్లింది.బి ఆర్ ఎస్ పార్టీ ఇంటి పెద్ద” కేసీఆర్ కు దారిపొడవునా కార్యకర్తల సంఘీభావం తెలిపారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చేందుకు, నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి కి వస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి దారిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు.పార్టీయే తమ కుటుంబమైన నేపథ్యంలో, తన కుటుంబానికి కష్టమొస్తే ఆదుకుంటున్న పెద్ద దిక్కు అధినేత కేసీఆర్ కు బి ఆర్ ఎస్ శ్రేణులు దారిపొడవునా అభివందనం తెలుపుతూ భుజం కలిపారు.కేసీఆర్ గారితో కలిసి పెద్ది”కి నివాళులు అర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు నర్సంపేట దిశగా తరిలారు.ఈ సందర్భంగా తమ అధినేతతో కలిసి తమ అభిమాన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ నేపథ్యంలో విషాదం తో నిండిన నర్సంపేట నియోజక వర్గ దారులన్నీ ఆదివారం నల్లబెల్లి వైపు మళ్ళినాయి.

అధైర్యం వద్దు.. మీకు నేనున్నానంటూ..” భరోసా ఇచ్చి ధైర్యం చెప్తూ, దారిలో తన కాన్వాయ్ ని ఆపుతూ కిందికి దిగి తనకు సంఘీభావం తెలిపేందుకు తన కాన్వాయ్ వస్తున్న తన బిడ్డలు, కుటుంబ సభ్యుల వంటి పార్టీ కార్యకర్తలను కేసీఆర్ అనునయిస్తూ, గుండె ధైర్యం నింపుతూ ముందుకు కదిలారు.అనంతరం వరంగల్ లో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో పాటు కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారితో పాటు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ గారు కాసేపు ముచ్చటించారు.
అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సందర్భంగా…దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి మాతృమూర్తి అమృతమ్మ, భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, లతోపాటు..పెద్ది సుదర్శన్ రెడ్డి అక్క సరోజనమ్మ, చెల్లెలు స్వాతి మాలకొండ రెడ్డి… పెద్దన్న రాయపరెడ్డి, మూడో అన్న రవీందర్ రెడ్డి, నాలుగో అన్న శ్రీనివాసరెడ్డి., పెద్ది అన్నల పిల్లలు..మహిపాల్ రెడ్డి,గణేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీలత, అనిత, కిరణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, అన్విత తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read:నల్లబెల్లికి కేసీఆర్..పెద్ది కుటుంబానికి భరోసా

బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారి వెంట పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర , మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు జి. జగదీశ్వర్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , కల్వకుంట్ల సంజయ్ , పాడి కౌశిక్ రెడ్డి , అనిల్ జాదవ్ , గంగుల కమలాకర్ , మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీలు , రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , యాదవరెడ్డి , శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, శేరి సుభాష్ రెడ్డి , క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ రెడ్యా నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ నేతలు రాకేష్ రెడ్డి వై సతీష్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,దాస్యం వినయభాస్కర్, సుమిత్రానంద తనోవా రజిని సాయి చంద్ గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, తాడేబోయిన విజయ్.. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -