లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళల స్వేచ్ఛా ప్రకటన గురించి మాట్లాడటంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతకుముందు రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతుంది.. మహిళల భాగస్వామ్యం, స్వేచ్ఛ లేకపోతే దేశం అసంపూర్ణంగా మిగిలిపోతుందని, దేశ రాజకీయం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ రిజిజు..ఇది కాంగ్రెస్ నుండి వచ్చిన ఒక సానుకూల సంకేతమని అన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. మహిళల విషయంలో శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నాను” అని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read:పేరుకే 5 స్టార్ హోటళ్లు..లోపల అంతా!
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతును తెలిపినప్పటికీ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ను నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టవద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

