సాగర్‌లో సీఎం వరుణయాగం

1
- Advertisement -

ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్ ఆవరణలో మహా వరుణ యాగం నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం జరుగనుంది.

దేవస్థాన బోర్డు ఏర్పడిన తర్వాత తొలిసారిగా వరుణ యాగం నిర్వహిస్తున్నారు. వరుణ యాగం బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది ప్రభుత్వం. ఆగస్టు 10న సా.3:20 నుంచి 3:24 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది.

Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

పూర్ణాహుతికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానుండగా మహా వరుణ యాగంలో 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాలు, వేద పండితులు, అర్చక బృందం పాల్గొననుంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కృష్ణా-గోదావరి నదులు కళకళలాడాలని యాగం చేపట్టనున్నారు.

- Advertisement -