ఫ్యూచర్క్రైమ్ సమ్మిట్లో వ్యక్తిగత సమాచారంపై వివాదంఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఇటీవల నిర్వహించిన ఫ్యూచర్క్రైమ్ సమ్మిట్–2026 వివాదానికి వేదికైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై నిర్వహించిన ఒక లైవ్ డెమోలో తన వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా ప్రదర్శించారంటూ అభిజీత్ దిప్కే అనే వ్యక్తి ఆరోపించడంతో ఈ వివాదం రాజుకుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యూరిటీ సమ్మిట్లో భాగంగా ఒక ఏఐ డెమోను ప్రదర్శించింది. అయితే, ఆ ప్రదర్శనలో ఏఐ సాంకేతికత సామర్థ్యాన్ని చూపించే క్రమంలో తన ప్రైవేట్, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేశారని అభిజీత్ దిప్కే ఆరోపించారు.ఈ ఘటనతో ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ డెమోలలో వ్యక్తిగత సమాచార వినియోగం మరియు డేటా ప్రైవసీపై మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
బాధితుడు అభిజీత్ దిప్కే చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు రిసెక్యూరిటీ సంస్థ గానీ లేదా ఫ్యూచర్క్రైమ్ సమ్మిట్ నిర్వాహకులు గానీ అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. స్పందన వెలువడకపోవడంతో పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ అభిజీత్ దిప్కే చేసిన ఆరోపణలు నిజమని తేలితే, పలు సాంకేతిక, చట్టపరమైన ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
డెమోలో ఉపయోగించిన సమాచారం ఇంటర్నెట్లో బహిరంగంగా లభించే డేటానా?,సదరు వ్యక్తి ముందస్తు అంగీకారంతోనే ఆ వివరాలను ఉపయోగించారా?,ఒకవేళ అనుమతి లేకపోతే, అంత సున్నితమైన సమాచారాన్ని ఏ మార్గం ద్వారా సేకరించారు?సాంకేతిక ఆధారిత భద్రతపై అవగాహన పెంచే సదస్సులోనే ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు రావడం డేటా పరిరక్షణ చట్టాల అమలు తీరుపై సందేహాలను రేకెత్తిస్తోంది.
Also Read:వర్షాలతో అలెర్జీ..వీటితో చెక్!


