ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, అసలైన ఉత్పత్తులను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, చేనేత-హస్తకళల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ (QR Code) విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

భారతదేశంలోనే హస్తకళలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి విడతగా రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అనుసంధానిస్తున్నారు.

కొండపల్లి బొమ్మలు (ఎన్టీఆర్ జిల్లా),ఏటికొప్పాక బొమ్మలు (అనకాపల్లి జిల్లా),కలంకారి కళాఖండాలు (మచిలీపట్నం & శ్రీకాళహస్తి),తోలుబొమ్మలాట కళ,నర్సాపూర్ లేస్ ఉత్పత్తులు (పశ్చిమ గోదావరి),ఉదయగిరి చెక్క వస్తువులు (నెల్లూరు),బుడితి పిత్తళ కళారూపాలు (శ్రీకాకుళం),మంగళగిరి చేనేత ఉత్పత్తులు.

నకిలీ లేదా మెషిన్ మేడ్ వస్తువుల బారిన పడకుండా, కొనుగోలుదారులు అసలైన చేతివృత్తుల ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చు.ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కళాఖండం ఎక్కడ తయారైంది? ఏ కళాకారుడు తయారుచేశాడు? దాని విశిష్టత మరియు తయారీ విధానం వంటి సమగ్ర సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

దళారుల ప్రభావం తగ్గి, కష్టపడి పనిచేసే స్థానిక హస్తకళాకారులకు నేరుగా గుర్తింపు, సరైన మద్దతు లభిస్తాయి.తొలి దశ విజయవంతం అయిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన అన్ని రకాల హస్తకళా ఉత్పత్తులకు కూడా ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను త్వరలోనే విస్తరిస్తామని అధికారులు వెల్లడించారు. సాంకేతికతను జోడించి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -