KTR:జయశంకర్ సార్ ఎన్‌సైక్లోపీడియా!

1
- Advertisement -

జయశంకర్ సార్ ఒక ఎన్‌సైక్లోపీడియా అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనతో కలిసి గడిపే అవకాశం దక్కడం నా అదృష్టం అన్నారు. సామంతరాజు లాగా రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి పోయిండు…ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోంది అన్నారు.స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ నమ్మేవారు.తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని నిన్న హరీష్ రావు వివరించారు.లోక్‌సభలో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్ వేర్పాటుతో పోలిస్తే, ఒక్కడన్న మాట్లాడిండా?,అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే గల్లా పట్టి అడిగేవారు కదా అన్నారు.

తెలంగాణలో ఇద్దరే మేధావులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు…జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి, కేశవరావు మేధావులు అంట..మరి జయశంకర్ గారు ఎక్కడికి పోయారు, విద్యాసాగర్ రావు ఎక్కడికి పోయాడు?.. మా వాళ్ల పేర్లు చెప్పలేదు అంటే సరే, మీతోనే ఉన్న కోదండరాం పేరైనా చెప్పాలి కదా? అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో మళ్లీ నీళ్లకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు ప్రెస్‌మీట్ పెట్టారు…తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం అడుగుతుంది…ఢిల్లీ పార్టీ చేతుల్లో జుట్టు ఉంటే వాళ్లు ఆడించినట్లే ఆడాలి…అదే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? చెప్పాలన్నారు. లోక్‌సభలో తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోలిస్తే ఒక్క బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా మాట్లాడిండా?.అదే మనవాడు ఉంటే గల్లా పట్టి అడిగేవాడు అన్నారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

కేసీఆర్‌కు మించి దక్షత, కమిట్‌మెంట్, తెలంగాణ సాధించాలనే మొండితనం ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అందుకే అతన్ని నమ్ముతాను అని జయశంకర్ సార్ అనేవారు…దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే వెళ్లి తెలంగాణ కోసం స్పర్థ లేకుండా సమాంతరంగా పని చేయాలని చెప్పారు…తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టినా, వారికి తాత్కాలిక భావసారూప్యత లేకపోయినా, లక్ష్యసారూప్యత ఉండాలని బలంగా వాదించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు.

- Advertisement -