హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేశాయి ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ ఎన్‌వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశాయి ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు.
సంతకం ఫోర్జరీ జరిగిందని అధికారులు గుర్తించారు. ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.
హైందవీ జూనియర్ కాలేజీ (బర్కత్‌పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (SR నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష్ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసు నమోదు చేయగా మరో 60 కాలేజీల ఎన్‌వోసీలను స్క్రూటినీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
Also Read:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద


