‘డయల్ 100’ స్థానంలో ‘112’ ప్రారంభం

1
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ‘డయల్ 100’ స్థానంలో ఇకపై కొత్త ఎమర్జెన్సీ నంబర్ ‘112’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఉద్దేశంతో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ఈ ‘డయల్ 112’ సేవలను అధికారికంగా ప్రారంభించారు.

ఇప్పటివరకు ఒక్కో అత్యవసర సేవ కోసం ప్రజలు వేర్వేరు నంబర్లను గుర్తుంచుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా ‘డయల్ 112’ ద్వారా ప్రధాన ఎమర్జెన్సీ సేవలను ఒకే కాల్‌తో పొందే సౌకర్యాన్ని కల్పించారు.

పోలీస్ రక్షణ: ఏదైనా క్రైమ్, అత్యవసర భద్రత లేదా ఆపద సమయాల్లో పోలీసుల సాయం కోసం.

అంబులెన్స్ (వైద్య సేవలు): ప్రమాదాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అంబులెన్స్ సదుపాయం కోసం.

అగ్నిమాపక సేవలు (ఫైర్ బ్రిగేడ్): ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు జరిగితే ఫైర్ సిబ్బంది తక్షణ సాయం కోసం.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్’ (ERSS) లో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.పౌరులకు గందరగోళం లేకుండా అన్ని ఎమర్జెన్సీ విభాగాలు ఒకే వేదికపై అనుసంధానించబడతాయి. జిపిఎస్ (GPS) టెక్నాలజీ ద్వారా బాధితుల లొకేషన్‌ను త్వరగా గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలు లేదా అత్యవసర సిబ్బందిని సంఘటనా స్థలానికి తక్షణమే పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

Also Read:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ఈ మార్పుపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ‘112’ నంబర్‌ను గుర్తుంచుకోవాలని డీజీపీ మరియు పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

- Advertisement -