తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేస్తారా?

1
- Advertisement -

చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో మాట్లాడిన హరీష్..GRMB అజెండాలో తెలంగాణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది… తెలంగాణను పోరాటాలతో తెచ్చుకున్నాం.. నీళ్ల కోసం కొట్లాడం అన్నారు. అదే నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు జాగ్రత్త చంద్రబాబు నాయుడు అని హెచ్చరించారాఉ.

తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిది… కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టాడు … కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయండి.. తెలంగాణ నోటికాడ ముక్క లాక్కొండని ప్రతిపాదించారు …దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నారు.

జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు.. జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారు అవుతుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు … ఒకవేళ ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోలేదా?..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేదు.. పైగా బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు రద్దు చేయాలనే ఎజెండా వచ్చింది .. ఎంత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఆరోపించారు.

Also Read:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

- Advertisement -