జూకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పాలి!

0
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహిళలు మరియు పిల్లలకు వ్యతిరేకంగా ఉన్న అభ్యంతరకరమైన ఏఐ (AI) కంటెంట్‌పై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ మెటా సంస్థకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఐటీ చట్టం కింద ఆ టెక్ దిగ్గజానికి సేఫ్ హార్బర్ రక్షణ (మినహాయింపు) లభించదని స్పష్టం చేసింది.

పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశంలోని యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ను కొద్దిసేపు నిలిపివేయడం (రెస్ట్ రిక్ట్ చేయడం) కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటా ఉన్నత స్థాయి గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు పంపడంతో ఈ వివాదం మొదలైంది. అధికారులు, మెటా ప్రతినిధుల సమావేశం ఈరోజు..రేపు జరగనుంది.

కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏఐ ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన కంటెంట్, మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన విషయాలపై తెలంగాణ పోలీసులు మెటాపై నమోదు చేసిన కేసు, అలాగే ఆర్థిక మోసాల యాప్‌లపై హైదరాబాద్ పోలీసులు గూగుల్‌పై నమోదు చేసిన కేసులకు ఐటీ చట్టం 79, 79(1), ఐటీ రూల్ 7 కింద భారత ప్రభుత్వం నుంచి ‘సేఫ్ హార్బర్’ రక్షణ లభించదు. ఈ సోషల్ మీడియా వేదికలు భారత రాజ్యాంగానికి కట్టుబడి తీరాల్సిందే అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read:ఎర్రసముద్రంలో భారత నౌకపై దాడి

ఆగస్టు 5, 6 తేదీల్లో మెటా గ్లోబల్ బృందం భారత ప్రభుత్వ అధికారులతో సమావేశమైనప్పుడు.. అల్గారిథమిక్ పక్షపాతం, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM), కంటెంట్ మోడరేషన్ విధానాలపై కేంద్రం గట్టిగా ప్రశ్నించనుంది. పేపర్ లీకేజీలపై చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు ఇచ్చింది. ఈ సమావేశానికి మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కాప్లాన్ హాజరయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

- Advertisement -