తెలంగాణలో మరో కుంభకోణం?

1
- Advertisement -

తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో (TSGENCO) మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పవర్ ప్లాంట్లలో తమకు కావలసిన వారికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు, పనులను ఇష్టారాజ్యంగా ముక్కలు ముక్కలుగా విభజించి కేటాయిస్తున్న వైనాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అక్రమాల ఫలితంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులు ఏకంగా రూ.469 కోట్లు పెరిగాయి.

థర్మల్ విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు తమ అనుకూలురకు ప్రయోజనం చేకూర్చేందుకు పనులను పెద్ద సంఖ్యలో చిన్న చిన్న కాంట్రాక్టులుగా విడగొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిపిన తనిఖీల్లో కేవలం బయ్యారంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోనే 400కు పైగా కాంట్రాక్టు పనులు చేయిస్తున్నట్లు ఉన్నతాధికారులు కనుగొన్నారు.

అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి, వారికి ఏ పని లేకపోయినా ప్రజాధనం నుండి జీతాలు చెల్లిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
కేవలం ఒక్క భద్రాద్రి ప్లాంట్ మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని పలు ఇతర జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

సాధారణంగా అన్ని జెన్‌కో కేంద్రాలకు కలిపి ఒక్క ఆర్థిక సంవత్సరానికి O&M పనుల నిమిత్తం రూ.2,068.70 కోట్లు సరిపోతాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) గతంలో ఆమోదం తెలిపింది.అనవసర నియామకాలు మరియు కాంట్రాక్టు వ్యయం పెరగడంతో O&M ఖర్చులను మరో రూ.890.44 కోట్లు పెంచాలని జెన్‌కో ఈఆర్‌సీని కోరింది.దీనిపై విచారణ జరిపిన ఈఆర్‌సీ, చివరకు రూ.469 కోట్లు పెంచుతూ ఆమోదం తెలిపింది.

Also Read:ఎర్రసముద్రంలో భారత నౌకపై దాడి

దీంతో మొత్తం O&M వ్యయం రూ.2,068.70 కోట్ల నుండి రూ.2,537.77 కోట్లకు పెరిగింది.O&M వ్యయం సవరణ కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) జెన్‌కో నుండి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌పై అదనంగా 0.46 పైసలు చెల్లించాల్సి వస్తోంది.ప్లాంట్లలో జరిగిన నిర్వహణా లోపాలు, అక్రమాల వల్ల పెరిగిన రూ.469 కోట్ల భారాన్ని అంతిమంగా ప్రజలపైనే కరెంట్ బిల్లుల రూపంలో మోపే ప్రమాదం ఉంది. అధికారుల స్వార్థం వల్ల ప్రజలపై అనవసర భారం మోపడం తీవ్ర అన్యాయం అని పలువురు మండిపడ్డారు.

- Advertisement -