వాట్సాప్..24 గంటలు బ్లాక్!

1
- Advertisement -

వాట్సాప్‌లో కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. ప్లాట్‌ఫారమ్ సర్వీస్ నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి ఖాతా కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని సమీక్షిస్తున్నట్లు వాట్సాప్ నుండి వినియోగదారులకు మెసేజ్ వచ్చింది. పలువురు వినియోగదారుల ఖాతాలను 24 గంటల వరకు సమీక్షలో (అండర్ రివ్యూ) ఉంచింది. అలాగే యాప్‌లోని అన్ని ఫీచర్ల వినియోగాన్ని తాత్కాలికంగా పరిమితం చేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఖాతాలు నిలిచిపోవడంతో ప్రభావితమైన వినియోగదారులు ఆందోళన చెంది సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి.. తమ విధానాలను ఉల్లంఘించే ఖాతాలను సస్పెండ్ చేయడం ద్వారా వేదిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కంపెనీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. మా సేవలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారి కంటే ముందే ఉండటానికి, ఇతర వినియోగదారుల రక్షణ కోసం మేము ఖాతాలను బ్యాన్ చేస్తుంటాము. కొన్నిసార్లు ఈ విషయంలో మా పొరపాటు జరగవచ్చు, ఒకవేళ అలా జరిగితే ప్రజలు తిరిగి చాటింగ్ చేసుకునేందుకు ఆ పొరపాటును వీలైనంత త్వరగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తాము అని ప్రతినిధి పేర్కొన్నారు.

ఈ అంతరాయం రాత్రి 8 గంటల సమయంలో మొదలైంది. తమ ఖాతాలు సమీక్షలో ఉన్నాయని వినియోగదారులు నివేదించడం ప్రారంభించారు. వాట్సాప్ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి ఖాతా కార్యకలాపాలు…డివైజ్ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని సాధారణంగా 24 గంటల్లోగా దీని ఫలితం తెలియజేస్తామని యాప్‌లో ఒక మెసేజ్ కనిపించింది.

అంతేకాకుండా, వాట్సాప్‌ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో తెలిపే మార్గదర్శకాలను, దొంగిలించబడిన ఫోన్లు లేదా హ్యాక్ అయిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ రివ్యూ స్క్రీన్ చూపించింది. ఈ ఆకస్మిక పరిమితులపై ప్రభావితమైన పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజ్ఞప్తి (అప్పీల్) చేసుకున్నప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఖాతాను డిసేబుల్ చేశారని ఒక వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేయగా, అధికారిక వాట్సాప్ యాప్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక లేకుండా సస్పెండ్ చేశారని, పని కోసం ఈ మెసేజింగ్ సర్వీస్ చాలా కీలకమని మరొకరు పేర్కొన్నారు.

Also Read:క్యాన్సర్ వైద్యంలో నూతన అధ్యాయం

వాట్సాప్ పలు ఖాతాలను 24 గంటల పాటు విచారణలో ఉంచింది. సోమవారం సాయంత్రం అనుకోకుండా పలువురు వినియోగదారుల ఖాతాలను పరిశీలనలోకి తీసుకుంది… ఫలితంగా వారు 24 గంటల పాటు యాప్ ఫీచర్లను ఉపయోగించలేకపోయారు” అని ఎక్స్ (X) వినియోగదారు ఒకరు తెలిపారు.

- Advertisement -