టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి, ప్రస్తుతం సరికొత్త కథాంశాలతో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శక-నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, అద్భుతమైన విజువల్స్ మరియు థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథానాయిక కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డిలు తమ పాత్రల్లో అత్యంత సహజంగా నటించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ముఖ్యంగా కామాక్షి పండించిన భావోద్వేగాలు, శ్రవణ్ నటన సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు
ఎం.ఎస్. రాజు మార్క్ టేకింగ్: సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ తెలియజేస్తోంది.

