నాణ్యమైన అభిరుచితో కూడిన సినిమాలను నిర్మించడంలో నాచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటారు. ఒక వైపు హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతూనే మరోవైపు తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై విభిన్నమైన కథాంశాలతో కొత్త తరహా చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన సమర్పణలో యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఒక సరికొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
టైటిల్ ప్రకటన సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక ‘గ్లింప్స్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌కు హీరో నాని అందించిన వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇంజినీరింగ్ పుస్తకాలను ముందు వేసుకుని నిద్రపోతున్న హీరోని చూపిస్తూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అతడి ముందు ‘గరం గోపాల్’, ‘ఆమెకు ఆమెంటే ఇష్టం’, ‘వత్రం వెంకన్న’ వంటి పలు ఆసక్తికర శీర్షికలతో ఉన్న పుస్తకాలను చూపిస్తారు. ఈ పుస్తకాలన్నింటినీ రాసింది ‘రుక్మిణి’ అనే ఒక మహిళ అని రివీల్ చేస్తారు.
ఇంతకీ ఈ రుక్మిణి ఎవరు? అని ప్రేక్షకులు ఆలోచనలో పడే సమయంలో.. “ఆమె నా భార్యే” అంటూ నితిన్ ఇచ్చే ఎంట్రీ, చెప్పే డైలాగ్ ఎంతో చమత్కారంగా కుతూహలాన్ని పెంచేలా ఉన్నాయి.
Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు
నాని నిర్మాణంలో నితిన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక సరికొత్త యూత్‌ఫుల్, ఎంటర్‌టైనింగ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది.

