ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ వ్యవహారంలో షాకింగ్!

1
- Advertisement -

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2014లో వివాహమైన మరో మహిళతో సన్నిహిత సంబంధం నడిపారు ఉదయ్ కృష్ణారెడ్డి.

2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో ఉంటున్న ఆ మహిళతో పరిచయం పెంచుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. హైదరాబాద్ వచ్చి కొంతకాలం ప్రైవేట్ జాబ్ చేసి.. ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఆ జాబ్ మానేసి అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది మహిళ.

లివ్-ఇన్ రిలేషన్‌లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా.. ఇంకా విడాకులు రాలేదని తిరస్కరించింది మహిళ. ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళను కలిసి, ఉదయ్ కృష్ణారెడ్డి తనపై దాడి చేసి విపరీతంగా కొట్టాడని తెలిపింది మహిళా ట్రైనీ ఐపీఎస్.

Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు

దీంతో ఆ మహిళ ఉదయ్ కృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో ల్యాప్‌టాప్, ఫోన్, రెండు ప్రేమలేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు విచారణలో గుర్తించారు పోలీసులు.

- Advertisement -