నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విద్యార్థులు, యువత తీవ్రమైన నిర్వేదంతో ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌లను పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణలో యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాలను భర్తీ చేస్తామని … దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.
యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్,…జాబ్ లెస్ క్యాలెండర్ అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ఇలాఖాలో ఓ యువకుడు ఆత్మహత్య యత్నంకు పాల్పడి లేఖను విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదన్నారు.ఆ విద్యార్థి సూసైడ్ లేఖ చూసి చాలా బాధ వేసిందన్నారు. ఇంజనీర్లను ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని దుయ్యబట్టారు. యువత నిలదీస్తే ఇండ్రీన్ తాగి చావాలని సీఎం సందేశం ఇవ్వడం దుర్మార్గమన్నారు.
Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు

