రాజకీయాలకు షెహజాద్ గుడ్‌బై?

1
- Advertisement -

భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా బయో నుండి ‘నేషనల్ స్పోక్స్ పర్సన్, బీజేపీ’ (జాతీయ అధికార ప్రతినిధి) అనే హోదాను తొలగించడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలగుతున్నారనే ప్రచారం మొదలైంది. అదే సమయంలో తాను రాజకీయాలకు దూరమవ్వాలనే ఆలోచనను గతంలో వెల్లడించిన పాత ఇంటర్వ్యూల వీడియో క్లిప్పులను ఆయన మళ్లీ రీపోస్ట్ చేశారు. అయితే తను బీజేపీకి లేదా ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారా అనే విషయంపై 38 ఏళ్ల పూనావాలా ఇప్పటివరకు నేరుగా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గురువారం రోజున ఆయన తన సవరించిన ఎక్స్ బయో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో “మతం: ఇస్లాం, సంస్కృతి: హిందూ, సిద్ధాంతం: భారతీయం. రచయిత: ‘జీఎస్టీ కీ యాత్ర’; ప్రధాని నరేంద్ర మోదీకి జీవితకాల అనుచరుడు” అని ఉంది. ఈ ఫోటోకు “నా నవీకరించబడిన బయో అనే క్యాప్షన్‌ను జత చేశారు.

అయితే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మాత్రం ఇప్పటికీ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగానే ఆయన హోదా కనిపిస్తోంది. తన సవరించిన బయో స్క్రీన్‌షాట్ షేర్ చేసిన దాదాపు రెండు గంటల తర్వాత, ఆయన జూలై 9 మరియు జూన్ 28 తేదీలకు చెందిన తన రెండు పాత వీడియోలను రీట్వీట్ చేశారు. రాజకీయాల్లో సేవ చేయడం అంటే కేవలం ఎన్నికల్లో ప్రతినిధిగా పోటీ చేయడం మాత్రమే కాదని ఆయన ఆ వీడియోలలో వివరించారు.

ఆ వీడియోలలో ఒకదానిలో మాట్లాడుతూ.. సమాజ సేవ అనేది రాజకీయాల కంటే చాలా పెద్దదని చెప్పారు. అంతేకాకుండా, 2025 లోక్‌సభ ఎన్నికల తర్వాతే తాను రాజకీయాల నుండి వైదొలగడానికి సిద్ధమయ్యానని కూడా ఆయన వెల్లడించారు.

ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేసే పూనావాలా, టీవీ న్యూస్ చర్చలు, రాజకీయ వేదికలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నిరంతరం గళం వినిపించేవారు. 2021లో ఢిల్లీలోని బీజేపీ సోషల్ మీడియా విభాగానికి ఆయనను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. వృత్తిరీత్యా లాయర్, సామాజిక వేత్త అయిన ఈ 38 ఏళ్ల నాయకుడు తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించారు. 2017లో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌పై తిరుగుబాట పట్టడంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

Also Read:దుల్కర్..’ఐ యామ్ గేమ్’

- Advertisement -