పార్లమెంట్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందడం భారత్కు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి దేశమంతా కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న ఆయన, పరీక్షల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే పరీక్షల సంస్కరణలను తీసుకురావడం అనివార్యమైందని ఆయన గుర్తుచేశారు.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మనకు కఠినమైన చట్టాలు అవసరం. అందుకే మేము పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాము. నేను మీకు మాట ఇచ్చినట్లే, పెద్ద సంఖ్యలో ఎంపీల భాగస్వామ్యంతో పార్లమెంట్లోని ఉభయ సభలు దీనిపై సుదీర్ఘంగా చర్చించాయి” అని ప్రధాని తన 2.26 నిమిషాల వీడియోలో తెలిపారు. కఠిన నిబంధనలతో కూడిన ఈ బిల్లును నేడు ఉభయ సభలు ఆమోదించాయి. నమ్మకమైన పరీక్షల వ్యవస్థను పునరుద్ధరించే దిశగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అడుగు పడింది. ఈ దిశగా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని మేము ఎక్కువ కాలం కొనసాగనివ్వము. మిత్రులారా ఇదే నమ్మకంతో ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేయడానికి తోడుగా ముందుకు సాగుదాం అని ఆయన జోడించారు.
Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?

