CJP ఎఫెక్ట్..18 మెట్రో స్టేషన్లు క్లోజ్!

3
- Advertisement -

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ 18 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మెట్రో స్టేషన్లు మూసివేయబడతాయి అని వెల్లడించారు. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్ మరియు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ (రైళ్లు మారే) సదుపాయం అందుబాటులో ఉంటుంది అని DMRC ‘X’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.

లోక్ కళ్యాణ్ మార్గ్,రాజీవ్ చౌక్,పటేల్ చౌక్,రామకృష్ణ ఆశ్రమం మార్గ్,బారాఖంబా రోడ్,సుప్రీం కోర్ట్,సేవా తీర్థ్,జన్పత్,మండి హౌస్,సెంట్రల్ సెక్రటేరియట్,ITO, ఢిల్లీ గేట్,ఇంద్రప్రస్థ,ఖాన్ మార్కెట్,జోర్ బాగ్,శివాజీ స్టేడియం,ఝాండేవాళాన్,న్యూ ఢిల్లీ స్టేషన్లను మూసివేశారు.

అంతకుముందు శుక్రవారం రోజున వరుసగా మూడో రోజు 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు. నిరసనల భద్రతా ఏర్పాట్ల కారణంగా బుధవారం, గురువారం కూడా ఇవే స్టేషన్లు సుదీర్ఘకాలం పాటు మూతపడటంతో సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగులు, విద్యార్థులు మరియు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గురువారం సాయంత్రం దాదాపు 14 గంటల మూసివేత తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, రాజీవ్ చౌక్ అనే మూడు స్టేషన్ల ఎంట్రీ గేట్లను తెరవగా, మిగిలిన స్టేషన్లు మూసే ఉంచారు. భారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది లేదా రోడ్డు రవాణాపై ఆధారపడాల్సి వచ్చింది.

Also Read:అసిడిటీనా లేక కిడ్నీ రాళ్ల సమస్యా?

- Advertisement -