విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి వేళ విడుదల చేసిన వీడియో సందేశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రధాని సభకు వచ్చి మాట్లాడకుండా, అర్థరాత్రి వేళల్లో ఏకపక్ష సందేశాలు ఇవ్వడం ఏంటని ఆయన నిలదీశారు.
పేపర్ లీకేజీల సమస్య మరియు విద్యార్థుల ఆందోళనలపై ప్రధాని మోదీ గురువారం రాత్రి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి కఠిన నిబంధనలతో కూడిన నూతన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఈ వీడియో సందేశంపై స్పందించిన మల్లికార్జున ఖర్గే ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంటు వేదికగా ప్రకటన చేయాలి…ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికైన పార్లమెంట్ సభలలో కాకుండా అర్ధరాత్రి వేళ కెమెరా ముందు నిలబడి ఏకపక్ష ‘మన్ కీ బాత్’ తరహా ప్రసంగాలు చేయడం సరికాదు అని ఖర్గే పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తు పేపర్ లీకేజీల వల్ల ప్రశ్నార్థకంగా మారాయని….దీనిపై ప్రధాని నేరుగా పార్లమెంటులోనే ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ALso Read:సోనమ్ దీక్ష విరమణపై అభిజిత్
విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న వీలైనన్ని అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఖర్గే పునరుద్ఘాటించారు.

