నల్ల చొక్కాలతో కాంగ్రెస్ ఎంపీల నిరసన

4
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నల్ల దుస్తులు ధరించి భారీ నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్రా సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్రా మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్లు సమర్థనీయమైనవని, వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో విద్యా బడ్జెట్ రూ. 1.4 లక్షల కోట్లు మాత్రమే ఉంటే, ప్రభుత్వం అదానీ, అంబానీలకు ఏకంగా రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. పదే పదే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. విద్యార్థులు నిజమైన మార్పు కోసం పోరాడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడంలో ఎలాంటి అప్రజాస్వామికత లేదు, కానీ ప్రభుత్వం విద్యార్థులతో, పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరే తీవ్ర అప్రజాస్వామికం అని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఎంపీలను గౌరవించడం లేదు. నిబంధనల ప్రకారం నిరసన తెలిపేవారిని కూడా వేధిస్తున్నారు. విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేయడమే వారి పని. మీరు మా సీనియర్ నేతలను తొక్కిపెట్టాలని చూస్తే, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తిరగబడతారు, అప్పుడు వారిని నియంత్రించడం మీ వల్ల కాదు. మేము దేనికీ భయపడేది లేదు, మా పోరాటం కొనసాగుతుంది అని ఖర్గే స్పష్టం చేశారు.

Also Read:ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదు:ట్రంప్

- Advertisement -