జీవితం నేర్పే పాఠాలకు అంతం లేదు!

1
- Advertisement -

తన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలను తిరస్కరించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్…తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆసుపత్రి నుంచి కోలుకోవడం మరియు క్రీడాకారులు ఓటమిని ఎదుర్కొనే సమయాల మధ్య పోలిక మాత్రమే చెప్పానని వివరించారు.

తన బ్లాగులో “ఆసుపత్రి”, “సర్జరీ”, “ఐసీయూ (ICU)” వంటి పదాలను ప్రస్తావించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ వార్త వైరల్ అయిన తర్వాతి రోజే అమితాబ్ స్పందిస్తూ.. తనకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.

తన కొత్త బ్లాగ్ పోస్ట్‌లో అమితాబ్ మాట్లాడుతూ.. సర్జరీ మరియు ఆసుపత్రిలో చేరిన తర్వాత మనుషులు ఎదుర్కొనే మానసిక, శారీరక పోరాటాల గురించి సాధారణంగా మాత్రమే రాశానని వివరించారు. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఓటమి పాలయ్యే చాంపియన్ మానసిక స్థితితో దీనిని పోల్చినట్లు తెలిపారు.

Also Read:సోనమ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రుల ఆరా

తన మునుపటి పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అది తన సొంత ఆరోగ్య పరిస్థితికి సంబంధించినది కాదని అమితాబ్ స్పష్టం చేశారు. నేను బాగానే ఉన్నాను.. నా పోస్ట్‌ను తప్పుగా భావించారు.. నేను కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చాను. శస్త్రచికిత్స లేదా ఐసీయూలో చేరి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కాలాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయం.. ఆ సమయంలో శారీరకంగా బలహీనపడిన పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది.. ప్రజలు అది నా గురించే అనుకున్నారు.. కానీ అది తప్పు.. ప్రతి చాంపియన్‌కూ తెలియాల్సిన విషయం ఏమిటంటే.. సమయం గడిచేకొద్దీ ఇంకో కొత్త చాంపియన్ వస్తాడు అని రాశారు. జీవితంలో నేర్చుకోవడానికి నిరంతరం ఎన్నో పాఠాలు ఉంటాయి అని ముగించారు.

- Advertisement -