ఆఫ్ఘనిస్థాన్ సీనియర్ బ్యాటర్ హష్మతుల్లా షాహిదీ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఆటగాడిగా మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశారు. 31 ఏళ్ల షాహిదీ, 2022 ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలోనే ఆఫ్ఘనిస్థాన్ జట్టు 2023 వన్డే ప్రపంచకప్ మరియు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో పోటీపడింది. ప్రస్తుతం ఆయన ఆఫ్ఘనిస్థాన్ టెస్టు జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
కెప్టెన్‌గా 2023 ప్రపంచకప్‌లో భారత్‌పై చేసిన పోరాటం ఒకటి. ఆ మ్యాచ్‌లో షాహిదీ 88 బంతుల్లో 80 పరుగులు చేసి ఆఫ్ఘనిస్థాన్ 272 పరుగుల భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డారు. అయినప్పటికీ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. సంపూర్ణ గౌరవంతో, నా వ్యక్తిగత నిర్ణయంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు నేడు ప్రకటిస్తున్నాను అని షాహిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. షాహిదీ నాయకత్వంలో ప్రపంచ ఛాంపియన్లైన ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లను చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. ఆ ప్రదర్శనతో వారు కొద్దిలో సెమీఫైనల్ బెర్తును చేజార్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టును నడిపించారు. కెప్టెన్‌గా ఈ బాధ్యతను నిర్వర్తించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా జట్టుతో కలిసి ప్రాతినిధ్యం వహించినందుకు, నిజాయితీగా, ఐక్యతతో, అంకితభావంతో పనిచేసినందుకు గర్వపడుతున్నాను అని ర్కొన్నారు.
Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య
షాహిదీ ఇప్పటివరకు 96 వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 2,600 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్‌ను ప్రకటించనుంది. కాగా తాను వన్డే ఎంపికకు అందుబాటులో ఉంటానని షాహిదీ స్పష్టం చేశారు.

