అడ్వకేట్స్ చట్ట సవరణ బిల్లు..ముసాయిదా!

5
- Advertisement -

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆరు దశాబ్దాల నాటి అడ్వకేట్స్ చట్టంలో భారీ మార్పులు తెచ్చేందుకు ‘అడ్వకేట్స్ చట్టం సవరణ బిల్లు, 2026’ (Draft Advocates Act Amendment Bill, 2026) ముసాయిదాను విడుదల చేసింది. భారతీయ న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడటం, న్యాయ వ్యవస్థను ఆధునీకరించడం మరియు న్యాయవాదుల సంక్షేమాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించారు.

ఈ ముసాయిదాపై జులై 31వ తేదీలోగా తమ అభిప్రాయాలు, సూచనలు తెలపాలని కోరింది.

1. భారత కోర్టుల్లో విదేశీ లాయర్లపై స్పష్టమైన నిషేధం

చట్టంలోని సెక్షన్ 47కు సవరణలు చేస్తూ, భారతీయ కోర్టులు, ట్రిబ్యునళ్లు, లేదా ఇతర రాజ్యాంగ సంస్థల ముందు వాదించే హక్కు కేవలం భారతీయ న్యాయవాదులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.విదేశీ లాయర్లు లేదా విదేశీ లా ఫామ్‌లు (Law Firms) భారతీయ కోర్టుల్లో హాజరుకావడానికి వీల్లేదు.
విదేశీ న్యాయవాదుల ప్రాక్టీస్ కేవలం అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) మరియు విదేశీ చట్టాలకు సంబంధించిన సలహాలకే పరిమితం అవుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి మరియు పరస్పర ఒప్పందాల (Reciprocity) ఆధారంగానే ఉంటుంది.

2. మహిళలకు 33% రిజర్వేషన్

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు చట్టబద్ధమైన రిజర్వేషన్‌ను ప్రతిపాదించారు.బిసిఐలో మహిళల ప్రాతినిధ్యాన్ని 25% నుంచి 33% కి పెంచనున్నారు (ఇందులో నలుగురు ఎన్నికైన సభ్యులు, ముగ్గురు నామినేట్/కో-ఆప్ట్ అయిన సభ్యులు ఉంటారు).

3. న్యాయవాదులకు సంక్షేమ నిధి మరియు పింఛను సౌకర్యం

అడ్వొకేట్ల కోసం బీమా, పింఛను (Pension), వైద్య సహాయం మరియు దివ్యాంగులైన న్యాయవాదులకు లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సహాయం అందించేందుకు ప్రత్యేక సంక్షేమ నిధులను ఏర్పాటు చేయనున్నారు.

Also Read:ఢిల్లీ నిరసనలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దీనిని బిసిఐ మరియు స్టేట్ బార్ కౌన్సిల్స్ నిర్వహించనున్నాయి.

4. ఎన్‌రోల్‌మెంట్ రుసుము (Enrolment Fee) పెంపు
సుప్రీంకోర్టు 2024 నాటి తీర్పు ఆధారంగా ఎన్‌రోల్‌మెంట్ ఫీజును పెంచేందుకు ప్రతిపాదించారు.కొత్తగా నమోదయ్యే అడ్వొకేట్లు స్టేట్ బార్ కౌన్సిల్‌కు ₹18,000 మరియు బిసిఐకి ₹4,500 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఈ రుసుములో 75% సడలింపు ఉంటుంది, వారు 1/4వ వంతు మాత్రమే చెల్లిస్తారు).

5. స్వయంప్రతిపత్తి పరిరక్షణ (వివాదాస్పద నిబంధనల తొలగింపు)
గతంలో (2025 ముసాయిదాలో) ప్రతిపాదించిన కొన్ని వివాదాస్పద అంశాలను ఈ కొత్త ముసాయిదా నుంచి పూర్తిగా తొలగించారు.బార్ కౌన్సిల్‌లో ప్రభుత్వ నామినీలను నియమించడం, నిరసనలు/స్ట్రైక్‌లలో పాల్గొనే లాయర్లకు ₹5 లక్షల భారీ జరిమానాలు విధించడం వంటి నిబంధనలను బిసిఐ తీవ్రంగా నిరసించడంతో వాటిని కొత్త ముసాయిదా నుండి తొలగించారు.

- Advertisement -