ఢిల్లీ నిరసనలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

3
- Advertisement -

దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే భవిష్యత్తులో గెన్-జీ (Gen-Z) ఆందోళన బాట పట్టడం ఖాయమని తాను పది నెలల క్రితమే హెచ్చరించానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన యువత మరియు విద్యార్థుల భారీ నిరసనల నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సుమారు పది నెలల క్రితం ఒక మీడియా కార్యక్రమంలో నేను మాట్లాడుతూ… ఈ దేశ యువత ఆశయాలను, ఆకాంక్షలను గనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే మన దేశంలో గెన్-జీ (Gen-Z) నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడే రోజు త్వరలోనే వస్తుందని స్పష్టంగా చెప్పాను అని కేటీఆర్ గుర్తుచేశారు. నిన్న ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు తన మాటలను నిజం చేశాయని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని కేటీఆర్ హితవు పలికారు. ఢిల్లీ నిరసనల తర్వాతైనా, విద్యారంగంలో సమూల సంస్కరణలు తీసుకురావడంతో పాటు వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచాలనే యువత డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్యల వల్ల కోట్లాది మంది యువకులు, విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి వారికి భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:లోక్‌సభ ముందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు!

- Advertisement -