ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 13వ స్థానానికి దిగజారడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే దుస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల తీరుపై విరుచుకుపడిన కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ 13వ స్థానానికి దిగజారింది. అంతకంటే ఇంకేం ఆశించగలం? వ్యాపారవేత్తల తలకు తుపాకీ గురిపెట్టి డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఏకంగా ఒక కేబినెట్ మంత్రి కుమార్తె బహిరంగంగానే ఒప్పుకున్నప్పుడు కాంగ్రెస్ వంటి పార్టీ నుంచి మనం ఇంతకంటే ఏమని ఊహించగలం? అని ప్రశ్నించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేసిన కేటీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో పెట్టుబడులు, అభివృద్ధి కాకుండా కేవలం నేరాలు మరియు దోపిడీ మాత్రమే పెరుగుతున్నాయి అని ఆరోపించారు.
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు సరైన రక్షణ మరియు అనుకూల వాతావరణం కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Telangana slips to 13th rank in Ease of Doing Business rankings
What can you expect from a party like Congress where a Cabinet Ministers’ daughter openly admits that Industrialists are threatened for money with a Gun to their head
Only crime and loot rising in Telangana pic.twitter.com/Fcu7XrEKux
— KTR (@KTRBRS) July 21, 2026
Also Read:లోక్సభ ముందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు!

