2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహంలో భాగంగా జలంధర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్‌లో రాజకీయ పట్టును తిరిగి సాధించడానికి మరియు సరికొత్త సామాజిక సమీకరణలను నిర్మించడానికి ఈ పర్యటనను బీజేపీ ఒక వేదికగా ఉపయోగించుకుంటోంది.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పంజాబ్‌లో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అందుతున్న నిధులు, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా పంజాబ్ ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అలాగే పంజాబ్ జనాభాలో దళిత (SC) ఓటర్ల శాతం చాలా ఎక్కువ. ముఖ్యంగా దోఆబా (Doaba) ప్రాంతంలో రవిదాసియా సామాజిక వర్గం రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైనది. జలంధర్ కేంద్రంగా ఉన్న ఈ వర్గానికి చేరువ కావడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల పంజాబ్ సాయుధ పోరాటం/తిరుగుబాటు నేపథ్యంలో ప్రముఖ నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సట్లెజ్’ (Satluj) అనే చిత్రం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ చిత్రాన్ని ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్ (ZEE5) నుండి విడుదలైన 48 గంటల్లోనే తొలగించారు.ఈ సినిమా ప్రదర్శనను వ్యతిరేకించినందుకు గానూ బీజేపీ నాయకులు పంజాబ్‌లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వివిధ రాజకీయ, సామాజిక సంస్థలు ఈ చిత్ర ప్రదర్శనకు మద్దతుగా నిలుస్తున్నాయి.
పంజాబ్‌లో ఈ భావోద్వేగపూరిత వాతావరణం మరియు పాత గాయాల గురించిన చర్చ మళ్లీ తెరపైకి రావడంతో బీజేపీ రాజకీయంగా కొంత రక్షణలో పడింది.గతంలో శిరోమణి అకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు పంజాబ్‌లో స్వతంత్రంగా ఎదగాలని చూస్తోంది. ప్రస్తుత ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (AAP) ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా నగదు పథకాలు, కాంగ్రెస్ అంతర్గత కలహాల మధ్య… ప్రధాని మోదీ ఇమేజ్‌తో రాజకీయ మైలేజ్ సాధించాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఒకవైపు ‘సట్లెజ్’ సినిమా వివాదం వల్ల ఏర్పడిన వ్యతిరేకతను తిప్పికొట్టడం…మరోవైపు రవిదాసియా వర్గాల మద్దతును కూడగట్టడం ద్వారా పంజాబ్‌లో కోల్పోయిన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి రాబట్టడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది.
Also Read:కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్ భేటీ

