Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్‌డేట్

1
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ వర్షం నేపథ్యంలో ఓ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ ఫైట్ చిరంజీవి కెరీర్‌లో కూడా అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ షూటింగ్‌లో చిరంజీవి చూపించిన అంకితభావం ప్రస్తుతం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది.

నిన్న షెడ్యూల్‌ లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ షూట్ చేశారు. మధ్యలో గంట లంచ్ బ్రేక్ తీసుకున్నారు తప్పితే మిగతా 12 గంటల పాటు వర్షంలోనే తడుస్తూ ఏకధాటిగా షూటింగ్ చేశారు. ఏమాత్రం అలసట లేకుండా అదే ఉత్సాహంతో యాక్షన్ సన్నివేశాలను చేయడం యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది.

మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు అదే ఎనర్జీ. అదే కమిట్‌మెంట్‌తో ప్రతి సన్నివేశాన్ని పూర్తి చేశారు మెగాస్టార్. ఆయన చూపించిన క్రమశిక్షణ, అంకితభావం చిత్రబృందంలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇది భారతీయ సినిమా రంగంలో అత్యంత కష్టపడి పనిచేసే స్టార్లలో ఒకరిగా ఆయన ఖ్యాతిని ఈ షెడ్యూల్ మరోసారి నిరూపించింది.

ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ భారీ రెయిన్ ఫైట్ సినిమా హైలైట్‌గా నిలిచి, ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించనుంది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు.

Also Read;కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య

భారీ యాక్షన్, బలమైన భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
రచన& దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె. నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను–నందు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత్ NK
Chief Co-Directors: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి. క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -