సీఎం టూర్‌లను నియంత్రిస్తారా?:సుప్రీం ఫైర్

2
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పర్యటనలపై ఆంక్షలు విధించాలని కోరుతూ డిఎంకె (DMK) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధితుల కుటుంబాలను ముఖ్యమంత్రి విజయ్ కలవకుండా అడ్డుకోవాలని డిఎంకె ఈ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం.. “ఒక రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి (ముఖ్యమంత్రి) పర్యటనలను, కదలికలను కోర్టు ఎలా నియంత్రించగలదు?” అని ప్రశ్నించింది. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శిస్తే.. అది సాక్షులను ప్రభావితం చేసినట్లు ఎలా అవుతుందని కోర్టు డిఎంకె తరపు న్యాయవాది రంజిత్ కుమార్‌ను నిలదీసింది.

కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తుందని స్పష్టం చేయడంతో, డిఎంకె తన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది. దీనితో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కేసు నేపథ్యం:నవంబర్ 2025 లో కరూర్ వేలుసామిపురంలో జరిగిన టీవీకే (TVK) బహిరంగ సభలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ (CBI) దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ బాధితులకు ప్రభుత్వ ఉత్తర్వులు, కారుణ్య నియామకాలు, ఇతర సహాయ నిధులు అందించేందుకు కరూర్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటన వల్ల దర్యాప్తు ప్రభావితం అవుతుందని, నిందితులు బహిరంగ ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని డిఎంకె నేత ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read:తొలి హైడ్రోజన్ రైలు..ప్రత్యేకతలివే!

- Advertisement -