అయోధ్యలోని రామాలయ విరాళాల దుర్వినియోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా తాజాగా బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల చోరి అంశం వెలుగులోకి వచ్చింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆరోపణలను కమిటీ సీరియస్‌గా తీసుకుందని BKTC ప్రెసిడెంట్ హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు.
విచారణలో ఆరోపణలు నిజమని తేలితే దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని BKTC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగాడ్ తెలిపారు.
ఏదైనా అవకతవకలు వెలుగుచూస్తే బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చట్టం…1939 మరియు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం దోషులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రంగాడ్ పేర్కొన్నారు. విచారణ ముగిసే వరకు ఎలాంటి ఆధారాలు లేని, తప్పుదోవ పట్టించే ఆరోపణలను ప్రచారం చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రామ మందిరం విరాళాల లెక్కలను బహిర్గతం చేయాలని మరియు ఈ నిధుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆలయ ట్రస్ట్ ఖాతాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రీ-ఆడిట్ నిర్వహించనుంది.
Also Read:SIR పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

