యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న చర్చలపై భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించారు. జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మాట్లాడిన మోర్కెల్.. ప్రస్తుతం జట్టులో స్థిరపడిన అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం అని చెప్పారు.
వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో ఉత్కంఠ, చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత జట్టులో ఇప్పటికే తమ స్థానాలను నిలబెట్టుకున్న ఆటగాళ్లకు మానసిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని మోర్కెల్ పేర్కొన్నారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మను, అలాగే వరల్డ్ కప్ ప్లేయర్‌గా రాణించిన సంజు శాంసన్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో మన నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ జట్టులో ఉన్నాడనే వాస్తవాన్ని మనం గౌరవించాలి. అలాగే సంజు శాంసన్ వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు అని మోర్కెల్ అన్నారు. సూర్యవంశీ వంటి యువ ఆటగాడు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉండటం ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినప్పటికీ, ప్రస్తుత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కోచింగ్ స్టాఫ్ యొక్క ప్రాథమిక బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు.
ఒక కోచింగ్ స్టాఫ్‌గా మన ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారికి వెన్నుదన్నుగా నిలవడమే సరైన పద్ధతి. అవును ఒక యువ ఆటగాడు జట్టు తలుపులు తడుతున్నాడు, అది నిజంగా సంతోషకరమైన విషయమే. కానీ కేవలం టాప్ ఆర్డర్ లోని ఆ ఇద్దరు ఆటగాళ్లకే కాకుండా, మిగిలిన జట్టు సభ్యులందరికీ కూడా ‘మేము మీకు అండగా ఉంటాం’ అనే నమ్మకాన్ని ఇవ్వడం జట్టుకు ఒక మంచి సంకేతం” అని మోర్కెల్ తెలిపారు.
Also Read:SIR పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

