EPFO సంచలన నిర్ణయం

4
- Advertisement -

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సరికొత్త ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్ 2026’ను నోటిఫై చేసింది. దీని ప్రకారం గరిష్టంగా రూ. 15,000 వేతనంపై ఉద్యోగి చెల్లించాల్సిన తప్పనిసరి పీఎఫ్ విరాళాన్ని నెలకు రూ. 1,800 గా పరిమితం చేసింది. అంతకంటే ఎక్కువ చెల్లించాలనుకుంటే అది పూర్తిగా ఉద్యోగి ఇష్టానికే (ఐచ్ఛికం) వదిలేసింది.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ప్రావిడెంట్ ఫండ్ విరాళాల నిబంధనలను భారీగా సవరించింది. ఉద్యోగి జీతం నుండి నెలకు కట్ అయ్యే తప్పనిసరి పీఎఫ్ విరాళాన్ని రూ. 1,800 గా పరిమితం చేయడంతో పాటు, అంతకు మించి చేసే అదనపు సహకారాన్ని పూర్తిగా తప్పనిసరి చేసింది.

ఈపీఎఫ్‌వో నోటిఫై చేసిన కొత్త ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్, 2026’ ప్రకారం.. ఉద్యోగులు నెలకు రూ. 15,000 ల చట్టబద్ధమైన గరిష్ట వేతన పరిమితిపై 12 శాతం విరాళం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఒక ఉద్యోగి ఎంత సంపాదిస్తున్నాడనే దానితో సంబంధం లేకుండా నెలకు తప్పనిసరిగా కట్ అయ్యే పీఎఫ్ విరాళం రూ. 1,800 మాత్రమే అవుతుంది.

ఉదాహరణకు చెప్పాలంటే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం నెలకు రూ. 1 లక్ష ఉన్నప్పటికీ…అతని జీతం నుండి తప్పనిసరిగా మినహాయించే పీఎఫ్ విరాళం రూ. 1,800 గానే ఉంటుంది. అలాగే ఈ పథకం నిబంధనల ప్రకారం యాజమాన్యం కూడా దానికి సమానమైన మొత్తాన్ని (రూ. 1,800) ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి.

ఒకవేళ రిటైర్మెంట్ (పదవీ విరమణ) నిధి కోసం అంతకంటే ఎక్కువ ఆదా చేయాలనుకునే ఉద్యోగులు.. ఈ చట్టబద్ధమైన పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛందంగా పీఎఫ్‌కు కంట్రిబ్యూట్ చేయవచ్చు. రూ. 15,000 పరిమితి కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు చట్టబద్ధమైన రేటు ప్రకారం లేదా అంతకంటే ఎక్కువ రేటుతో విరాళం ఇవ్వడానికి ఎంచుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Also Read:చర్చలకు పిలిచి..పారిపోతారా?:కేటీఆర్

అయితే ఉద్యోగులు స్వచ్ఛందంగా చెల్లించే ఈ అదనపు విరాళాలకు సమానమైన మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉండదు. యాజమాన్యాలు తమ స్వంత నిర్ణయం (విచక్షణ) మేరకు కావాలనుకుంటే ఆ అదనపు మొత్తాన్ని జమ చేయవచ్చు, లేదంటే లేదు. అలాగే, ఇటువంటి అదనపు స్వచ్ఛంద విరాళాలను ఎప్పుడైనా తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా నిలిపివేయడానికి ఈ కొత్త నిబంధనలు ఉద్యోగులు మరియు యాజమాన్యాలు ఇద్దరికీ అనుమతిస్తాయి.

సవరించిన ఈ కొత్త నిబంధనల వల్ల దాదాపు 8 కోట్ల మంది యాక్టివ్ ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారులపై ప్రభావం పడనుంది. ఇది ఉద్యోగుల చేతిలో ఉండే డబ్బుకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తూనే… తప్పనిసరి పీఎఫ్ మినహాయింపును నెలకు రూ. 1,800 కి పరిమితం చేస్తుంది.

- Advertisement -