డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు పూరి

227
Puri face SIT
- Advertisement -

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ప్రారంభమైంది. నేటి నుంచి 28 వరకు సిట్ సినీ ప్రముఖులను విచారించనుంది. ఆబ్కారీ అధికారులు ఇప్పటికే విచారణ కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. కొద్ది రోజులుగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరి బుధవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్ తో పాటు, తమ్ముడు సాయిరామ్ శంకర్ కూడా పూరితో పాటు అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు.

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది పూరికి సన్నిహితులు కావటంతో ఈ రోజు జరగబోయే విచారణలో కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూడు దశల్లో పూరిని విచారించనున్నారు. ఈ రోజు విచారణలో సిట్ అధికారులు పూరి అడిగేందుకు పది ప్రశ్నలు సిద్ధం చేశారు.
() కెల్విన్‌ ఎలా పరిచయం అయింది?
() కెల్విన్‌, జిషన్‌లు మీ ఇంటికి ఎందుకు వచ్చారు?
() ఎంతకాలంగా రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నారు?
() కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు?
()నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు?

() కెల్విన్‌ కంటే ముందు మీకు డ్రగ్స్‌ ఎవరు, ఎలా సరఫరా చేసేవారు?
() ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవి తేజ, సుబ్బరాజులకు.. డ్రగ్స్‌, కొకైన్‌ మీ నుంచే వెళ్లిన మాట నిజమా, కాదా? అనే విషయాలపై పూరి నుంచి రిటర్న్ స్టేట్ మెంట్ కూడా తీసుకోనున్నారు.

పూరి తర్వాత  20న హీరోయిన్ చార్మీ,21న ముమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న కెమెరామెన్ శ్యామ్ కెనాయుడు, 24న హీరో రవితేజ,25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్,28 న నందు, తనీష్‌లను సిట్ విచారించనుంది.

- Advertisement -