హోటళ్లలో ఫ్రీ వాటర్ ఇవ్వాల్సిందే!

5
- Advertisement -

హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన సంస్థ (FDA)కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ఈటింగ్ హౌస్‌లు మరియు రెస్టారెంట్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా తాగునీటిని (Free Drinking Water) కచ్చితంగా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆహార భద్రత, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఎఫ్‌డీఏ ఈ సమగ్ర ఉత్తర్వులను వెలువరించింది.

చాలా చోట్ల హోటల్ యాజమాన్యాలు ఉచితంగా నార్మల్ తాగునీరు అందించకుండా, కస్టమర్లను ఖరీదైన ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

ఉచిత తాగునీరు తప్పనిసరి: హోటల్‌కు వచ్చే ప్రతి వినియోగదారుడికి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకుండా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి.

ఆహార భద్రతా ప్రమాణాలు: వంటగదులు (Kitchens) అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఆహార తయారీలో నాణ్యమైన పదార్థాలనే వాడాలి.

పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు: హోటళ్లలోని టాయిలెట్లు, వాష్‌రూమ్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. కస్టమర్లకు ఇవి అందుబాటులో ఉండాలి.

Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

మెనూ కార్డ్‌పై స్పష్టత: మెనూ కార్డులలో ధరలు, సర్వీస్ ఛార్జీలు (వర్తిస్తే) స్పష్టంగా పేర్కొనాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న, పెద్ద హోటళ్లు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలతో పాటు అవసరమైతే లైసెన్సులను కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని వెల్లడించారు.

- Advertisement -