కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు!

2
- Advertisement -

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరియు కార్పొరేట్ పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు, 2026’ పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) వేగంగా అడుగులు వేస్తోంది. బుధవారం జరిగిన ఈ కమిటీ సమావేశంలో జాతీయ ఆర్థిక నివేదికల ప్రాధికార సంస్థ (NFRA) ప్రతినిధులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పా

బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంయుక్త కమిటీ… మార్చి 23న కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం..కంపెనీల చట్టం 2013 మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP) చట్టం, 2008 లలో సమగ్ర మార్పులు చేయడం. చిన్నపాటి సాంకేతిక, విధానపరమైన లోపాలను నేరాల జాబితా నుండి తప్పించి, వాటికి కేవలం ద్రవ్య జరిమానాలు మాత్రమే విధించడం. దీనివల్ల కంపెనీలపై అనవసర న్యాయపరమైన ఒత్తిడి తగ్గుతుంది.

Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

దేశీయ కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థను ఆధునీకరించడం మరియు ఆడిటింగ్ నాణ్యతను పెంచడం ద్వారా పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడటం.ఈ సవరణల ద్వారా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు నిబంధనల భారం తగ్గడమే కాకుండా, వివాదాల త్వరితగతిన పరిష్కారానికి ‘సెటిల్‌మెంట్ ప్రొసీడింగ్స్’ వంటి సరికొత్త వేదికలు అందుబాటులోకి రానున్నాయి.ఈ బిల్లుపై పరిశ్రమల సంఘాలు, చట్టపరమైన నిపుణులు మరియు ఇతర వాటాదారుల నుండి సేకరించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ పార్లమెంటరీ కమిటీ తన తుది నివేదికను పార్లమెంటుకు సమర్పించనుంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే, భారతదేశంలో విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -