వెనిజులాకు అండగా భారత్!

2
- Advertisement -

వెనిజులా దేశంలో సంభవించిన భారీ జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు, ఈ కష్టసమయంలో వెనిజులాకు భారత్ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. భారతదేశ ప్రజల తరఫున వెనిజులా ప్రభుత్వానికి అక్కడి ప్రజలకు ముఖ్యంగా తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలంలో భారత్ మీకు తోడుగా ఉంటుంది మరియు అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు.

వెనిజులాలో బుధవారం సాయంత్రం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు కనీసం 32 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. శతాబ్ద కాలంలో వెనిజులాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాలలో ఇది ఒకటి కావడం గమనార్హం.

యూఎస్ జీఎస్ (USGS) ప్రకారం… మొదటి భూకంపం తీరప్రాంత పట్టణమైన ‘మొరోన్’ సమీపంలో భూగర్భంలో 22 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ వెంటనే మరింత శక్తివంతమైన 7.5 తీవ్రతతో కూడిన రెండవ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో మొరోన్‌కు నైరుతి దిశలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం పొరుగు దేశాలలో కూడా కనిపించింది.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… భూకంపం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దానిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!