మెటర్నిటీ లీవ్‌లో సమంత!

7
- Advertisement -

నటి సమంత రూత్ ప్రభు తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ సభలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టారు సమంత. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ చిన్న విరామం (మెటర్నిటీ లీవ్) తీసుకున్న తర్వాత మళ్లీ తిరిగి పనిలోకి వస్తానని వెల్లడించారు.

సమంత గర్భం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత ఈ వార్తలపై స్పందిస్తూ… సారీ ఫ్రెండ్స్…కెరీర్‌లో మరో చిన్న గ్యాప్ రాబోతోంది ఆ తర్వాత మళ్లీ తిరిగి వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని నాకు తెలుసు. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నారు.

సమంత రూత్ ప్రభు మరియు రాజ్ నిడిమోరుల వివాహం 2025 డిసెంబర్ 1న ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది.

Also Read;సర్దార్ 2 వర్సెస్ రణబలి!

- Advertisement -