రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై అమెరికా వైట్ హౌస్‌లో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉక్రెయిన్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించే ‘శాంతిభద్రతల పరిరక్షణ దళం’గా భారత సైన్యాన్ని రంగంలోకి దించవచ్చని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రతిపాదించారు. అయితే ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ ఆలోచనను నవ్వుతూ సున్నితంగా తిరస్కరించారు.
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే (జనవరి 30న) వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ట్రంప్ నియమించిన ఉక్రెయిన్, రష్యా ప్రత్యేక రాయబారి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్.. యుద్ధాన్ని ముగించడానికి “ఆన్ అమెరికా ఫస్ట్ ప్లాన్: ట్రంప్స్ హిస్టారిక్ పీస్ డీల్” అనే ప్రతిపాదనను ఉంచారు. దీనిపై చర్చించేందుకు ట్రంప్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్‌సెత్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ తదితరులు హాజరయ్యారు.
రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను అమెరికా అధికారికంగా గుర్తించబోదని, అదే సమయంలో ఆ భూభాగాలను తిరిగి దక్కించుకోవడానికి ఉక్రెయిన్ సైనిక చర్యలు చేపట్టకూడదనేది ఈ ప్లాన్ సారాంశం. యుద్ధ విరమణను పర్యవేక్షించడానికి ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాల సైనికులను ఉక్రెయిన్‌లో ఉంచాలని కెల్లాగ్ ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనపై వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటో (NATO) కూటమికి చెందిన దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలో ఉంచితే రష్యా మరింత రెచ్చిపోతుందని, అది అమెరికాను నేరుగా యుద్ధంలోకి లాగే ప్రమాదం ఉందని వెన్స్ వాదించారు. నాటోయేతర దేశాల నుండి ఎవరినైనా పంపే అవకాశం ఉందా? అని ఆయన ప్రశ్నిస్తూ… సౌదీ అరేబియా లేదా భారతదేశం (ఇండియా) సైన్యాన్ని ఇందుకు ఉపయోగించుకోవచ్చని జేడీ వాన్స్ సూచించారు.
Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

