రాష్ట్రంలోని నేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కెటి రామారావు తెలిపారు. దశాబ్దాలుగా సంక్షోభం అంచున నిలిచిన నేత కార్మిక లోకానికి కొత్త వెలుగులు పంచాలన్న ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను తమ ప్రభుత్వం రూపొందిస్తున్నదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వివిధ శాఖలు, పథకాలకు సేకరించే ప్రతి మీటర్ వస్ర్తాన్ని రాష్ర్టంలోని కార్మికుల నుంచే సేకరించాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు రాష్ర్టంలోని కార్మికులు తమ వస్ర్తోత్పత్తి ప్రణాళిక రూపొందించుకునేందుకు ఉద్దేశించిన వార్షిక క్యాలెండర్ ను మంత్రి అదేశాల మేరకు ఈ రోజు టెక్స్టైల్స్ శాఖ ప్రకటించింది. ఈ క్యాలెండర్ ద్వారా ఏ నెలలో వస్త్రాలను కొనుగోలు చేసేది పెర్కోన్నారు. దీంతో అయా కాలానికి అవసరం అయిన ముడి సరుకును కోనుగోలు చేసుకునేందుకు, ముందస్తు ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలు కలుగుతుంది తెలిపారు.
ఈ ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ర్టంలోని అత్యధిక శాతం మరమగ్గాలున్న సిరిసిల్లా కార్మికులకు పూర్తి స్ధాయిలో పని దొరుకుతుందన్నారు. ముఖ్యంగా పవర్ లూమ్స్ అధికంగా ఉన్న ఈ పట్టణంలో కార్మిక కుటుంబాలకు కూలీ గిట్టుబాటు అవుతుందన్నారు. గతంలో రాజీవ్ విద్యా మిషన్ కోసం సేకరించే వస్ర్తాలను ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసేవారు. అయితే గత ఎడాది నుంచి సిరిసిల్లా నుంచే తక్కువ రేటుకు నాణ్యమైన వస్ర్తాలను కోనుగోలు చేసేలా అదేశాలిచ్చామని, దీంతో అక్కడ సంక్షోభంలో ఉన్న పవర్ లూమ్ పరిశ్రమకు ఊరట లభించిందని మంత్రి తెలిపారు.
ఈ అనుభవ నేపథ్యంలో ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ వస్ర్తాన్ని రాష్ర్టంలోని నేతన్నల నుంచే సేకరించాలని అదేశాలిచ్చామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం టెక్స్టైల్స్ శాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మే నుంచి అగస్టు నెలల్లో బతుతకమ్మ చీరలు, డిసెంబర్ నుంచి మార్చి నెలల్లో సాంఘిక సంక్షేమ శాఖ వస్ర్తాలు, విద్యాశాఖ స్కూల్ యూనిఫారాలు, అక్టోబర్ నెలలో క్రిస్టియన్ల కోసం ఇచ్చే క్రిస్ర్మాస్ వస్ర్తాలు, ఎప్రిల్ నెలల్లో రంజాన్ వస్ర్తాలు కోనుగోలు చేసేందుకు వీలుకలుగుతుందన్నారు. దీంతోపాటు కేసీఆర్ కిట్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం పెద్ద మెత్తంలో వస్ర్తాల కోనుగోలు జరుగుతుందన్నారు. దీంతో కార్మికులు ఎడాది పొడుగునా పని చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.
ప్రస్తుతం సిరిసిల్లాలోని మరమగ్గాల ద్వారా బతుకమ్మ చీరలను కోనుగోలు చేసేందుకు నడుస్తున్న ప్రణాళికలపైన మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని సూమారు 95 లక్షల మహిళలకు బతుకమ్మ చీరలను ఇస్తామని, ఇందులో సగానికి పైగా సిరిసిల్లా నుంచే సేకరిస్తామన్నారు. ఈసారి సమయం తక్కువగా ఉండడం ద్వార మిగిలిన సగం చీరలను ఇతర రాష్ర్టాలనుంచి సేకరించాల్సి వస్తుందని, వచ్చే ఎడాది మాత్రం పూర్తి స్ధాయిలో సిరిసిల్లాతో రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల మరమగ్గ కార్మికుల నుంచే సేకరిస్తామని మంత్రి తెలిపారు. RVM కోసం కోటి ఇరవై లక్షల మీటర్లు, సాంఘిక సంక్షేమ శాఖలకు 30 లక్షలు, రంజాన్ 36 లక్షలు, క్రిస్టమస్ 27 లక్షలు, కెసియార్ కిట్లు, ఇతరాలకు 25లక్షల మీటర్ల వస్ర్తాలను ఎడాది కాలంలో సేకరించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మెత్తంగా సిరిసిల్లాలోని సూమారు 35 వేల మరమగ్గాల్లో పనిచేస్తున్న 25 వేల మందితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు ఉపాధి దొరకనున్నది.